Politics19th Jan 04:05 PMSunil Byrisetty1 min read

వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు!

రాష్ట్రంలో సంచలనం రేపిన మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని 22న, మిథున్‌రెడ్డిని 23వ తేదీన రావాలని ఈడీ కబురు చేసింది.

వైసీపీ ఎంపీకి ఈడీ నోటీసులు!
రాష్ట్రంలో సంచలనం రేపిన మద్యం కుంభకోణంలో వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డికి ఈడీ నోటీసులు జారీ చేసింది. మాజీ ఎంపీ విజయసాయిరెడ్డిని 22న, మిథున్‌రెడ్డిని 23వ తేదీన రావాలని ఈడీ కబురు చేసింది. ఇప్పటికే లిక్కర్ స్కాంలో విజయసాయిరెడ్డి ఏ5గా ఉన్నారు. కానీ ఆయన తనను తాను విజిల్ బ్లోయర్ గా ప్రకటించుకుని ఏపీ ప్రభుత్వం నియమించిన సిట్‌కు అన్ని వివరాలు చెబుతూ సహకరిస్తున్నందున అరెస్టు చేయలేదు. కానీ మిథున్‌రెడ్డి మాత్రం సుప్రీంకోర్టు వరకూ వెళ్లినా రిలీఫ్ దొరకక అరెస్టయ్యారు. అనూహ్యంగా ఏసీబీ కోర్టు బెయిల్ ఇవ్వడంతో బయటకు వచ్చారు. అయితే ఇప్పుడు ఆయనపై ఈడీ గురి పెట్టింది. దీంతో ఈడీ విచారణలో మిథున్ ఏం చెబుతారనే దానిపై వైసీపీలో చర్చలు జరుగుతున్నాయి.
Andhra Pradesh Politics
YSRCP
Mithun Reddy
ED Notices
Liquor Scam
Liquor Case
Vijayasai Reddy
Enforcement Directorate
సిట్ విచారణ
ఏసీబీ కోర్టు
బెయిల్
వైసీపీ అంతర్గత
Scroll for the next article