Entertainment22nd Apr 11:03 AMSunil Byrisetty1 min read

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ షాక్

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ షాకిచ్చింది. ఇటీవల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్‌లో అధికారులు ఆధారాలను సేకరించ

సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ షాక్
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబుకు ఈడీ షాకిచ్చింది. ఇటీవల హైదరాబాద్ రియల్ ఎస్టేట్ సంస్థలైన సురానా డెవలపర్స్, సాయి సూర్య డెవలపర్స్ పై జరిగిన ఈడీ రైడ్స్‌లో అధికారులు ఆధారాలను సేకరించారు. ఆయా రియల్ ఎస్టేట్ కంపెనీలకు చేసిన వాణిజ్య ప్రకటనలకు మహేష్ బాబు రూ.5.9 కోట్లు పారితోషికంగా తీసుకున్నట్టు ఈడీ అధికారులు ఆరోపిస్తున్నారు. అందులో రూ. 2.5 కోట్లు మనీ లాండరింగ్ ద్వారా అక్రమ పద్ధతిలో తీసుకున్నట్టు ఈడీ అధికారులకు ఆధారాలు లభించాయి. మహేష్ బాబు చేసిన ప్రకటనలను చూసి, ఈ రియల్ ఎస్టేట్ సంస్థలో అక్రమాలు జరుగుతున్నాయని తెలియక అనేకమంది పెట్టుబడులు పెట్టారని ఈడీ అధికారులు పేర్కొన్నారు. రియల్ ఎస్టేట్ సంస్థల అక్రమాలలో భాగస్వామ్యం లేకున్నా, అక్రమమైన పద్ధతిలో డబ్బును స్వీకరించినందుకు మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చిన ఈడీ అధికారులు ఏప్రిల్ 27 న విచారణకు హాజరు కావాలని ఆదేశించారు.
Telangana
Mahesh Babu
Sai Surya Developers Scam
ED Notice to Mahesh Babu
హైదరాబాద్ రియల్ ఎస్టేట్
5.9 కోట్లు
మహేష్ బాబుకు నోటీసులు ఇచ్చిన ఈడీ
Scroll for the next article