News8th Jan 04:09 PMSunil Byrisetty1 min read

ఐప్యాక్‌పై ఈడీ దాడి!

ప్రముఖ ఎన్నికల వ్యూహరచన సంస్థ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. గురువారం ఉదయం నుంచి

ఐప్యాక్‌పై ఈడీ దాడి!
ప్రముఖ ఎన్నికల వ్యూహరచన సంస్థ ఇండియా పొలిటికల్ యాక్షన్ కమిటీ (ఐ-ప్యాక్) కార్యాలయాలపై ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) దాడులు నిర్వహించడం తీవ్ర కలకలం రేపింది. గురువారం ఉదయం నుంచి కోల్‌కతాలోని సాల్ట్ లేక్‌లో ఉన్న ఐ-ప్యాక్ ప్రధాన కార్యాలయంతో పాటు, సంస్థ సహ వ్యవస్థాపకుడు ప్రతీక్ జైన్ నివాసంలోనూ ఈడీ అధికారులు ఏకకాలంలో సోదాలు ప్రారంభించారు. కేంద్ర సాయుధ బలగాల (సీఏపీఎఫ్) పటిష్ట భద్రత నడుమ ఈ దాడులు జరిగాయి. ఈ పరిణామంపై పశ్చిమ బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది పూర్తిగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా పన్నిన కుట్రేనని, దేశ చరిత్రలోనే ఇంతటి దుర్మార్గపు, నీచమైన హోంమంత్రిని చూడలేదని ఆమె తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. 2021 అసెంబ్లీ ఎన్నికలకు ముందు, అంటే 2020 నుంచి ఐ-ప్యాక్ సంస్థ తృణమూల్ కాంగ్రెస్‌కు ఎన్నికల వ్యూహకర్తగా పనిచేస్తోంది.
ED Raids
I-PAC
India Political Action Committee
Prashant Kishor
Enforcement Directorate
Mamata Banerjee
Trinamool Congress
West Bengal Politics
Political Controversy
Election Strategists
Scroll for the next article