Politics21st Aug 05:24 PMSunil Byrisetty1 min read
ఈడీ సోదాలతో కడప రాజకీయాల్లో కలకలం
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. అదే సమయంలో ఆయన ముఖ్య అనుచరుడిగా పేర్కొనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నివాసం,
కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి నివాసంలో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించారు. అదే సమయంలో ఆయన ముఖ్య అనుచరుడిగా పేర్కొనే దేవిరెడ్డి శివశంకర్ రెడ్డి నివాసం, కార్యాలయాల్లోనూ ఈడీ అధికారులు తనిఖీలు చేపట్టడం కడప జిల్లాలో కలకలం రేపింది. ఈ సోదాలకు సంబంధించిన పూర్తి వివరాలు, ఏ కేసు లేదా అంశానికి సంబంధించి ఈడీ అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారన్న దానిపై అధికారిక సమాచారం వెలువడాల్సి ఉంది. ఈడీ సోదాల సమాచారం కడప జిల్లా రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అయితే మాజీ మంత్రి వివేకా హత్య కేసు దర్యాప్తులో భాగంగా ఈ సోదాలు చేసినట్లు చెబుతున్నారు.