Politics10th Oct 04:27 PMSunil Byrisetty1 min read

జగన్ కేసులపై ఈడీ స్పీడ్

మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. తాజాగా తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. కేసుల్లో రోజువారీ విచారణ

జగన్ కేసులపై ఈడీ స్పీడ్
మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌ అక్రమాస్తుల కేసుల్లో ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్(ఈడీ) దూకుడు పెంచింది. తాజాగా తెలంగాణ హైకోర్టులో ఈడీ పిటిషన్‌ దాఖలు చేసింది. కేసుల్లో రోజువారీ విచారణ జరిపి వేగంగా తేల్చాలని పిటిషన్‌లో పేర్కొంది. జగన్‌ సహా నిందితులందరినీ వ్యక్తిగతంగా హాజరయ్యేలా ఆదేశించాలని ఈడీ కోరింది. సీబీఐ కోర్టులో 9 ఈడీ ఛార్జిషీట్లు పదేళ్లుగా పెండింగ్‌ ఉన్నాయని పేర్కొంది. సీబీఐ కోర్టులో డిశ్చార్జి పిటిషన్లు తేలకపోవడంతో విచారణ ముందుకు వెళ్లడం లేదని ఈడీ తెలిపింది. అలాగే హరిరామజోగయ్య, ఇతరుల పిటిషన్లతో కలిపి ఈడీ పిటిషన్ జత చేయాలని ఆదేశించింది. జగన్ కేసులను వేగంగా విచారణ జరపాలన్న అన్ని పిటిషన్లు కలిపి ఈ నెల 13న విచారణ జరపనుంది. దీంతో జగన్ కు చిక్కులు తప్పవా అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
Scroll for the next article