Education7th Jun 11:59 AMSunil Byrisetty1 min read

విద్యా హక్కు చట్టం ప్రవేశాల గడువు పొడిగింపు

ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద కేటాయించిన సీట్లలో విద్యార్థులు చేరేందుకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించి నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు

విద్యా హక్కు చట్టం ప్రవేశాల గడువు పొడిగింపు
ప్రైవేటు పాఠశాలల్లో విద్యా హక్కు చట్టం కింద కేటాయించిన సీట్లలో విద్యార్థులు చేరేందుకు గడువును ఈ నెల 10 వరకు పొడిగించి నట్లు సమగ్ర శిక్షా అభియాన్ ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ప్రైవేటు పాఠశాలల్లో 25% సీట్లను విద్యాహక్కు చట్టం కింద భర్తీ చేస్తున్నారు. మొదటివిడతలో 23,117 మందికి సీట్లు కేటాయించగా.. ఈ నెల 7లోపు పాఠశాలల్లో చేరాలని సూచించారు. 7న బక్రీద్, 8న ఆదివారం సెలవుల కారణంగా గడువును 10వ తేదీ వరకు పొడిగించినట్లు ఆయన తెలిపారు. రెండో విడత ఆర్టీఈ ప్రవేశాల ఫలితాలను జూన్ 14న విడుదల చేసి, సీట్లు పొందినవారు 21లోపు ప్రవేశాలు పొందేందుకు అవకాశం కల్పిస్తామని పేర్కొన్నారు.
Andhra Pradesh news
Education Act in private schools
Srinivasa Rao
Samagra Shiksha Abhiyan Project
విద్యా హక్కు చట్టం ప్రవేశాల గడువు పొడిగింపు
పాఠశాలల్లో 25% సీట్లను విద్యాహక్కు చట్టం కింద భర్తీ
Scroll for the next article