News11th Jan 04:35 PMSunil Byrisetty1 min read

విద్యతోనే బీసీలు శాసించే స్థాయికి!

బ్రిటిష్ నిరంకుశ పాలనకు ఎదురొడ్డి ప్రజల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఆదివారం అనంతపురము నగరంలోని లలిత కళా పరిషత్ వేదికగా ఘనంగా నిర్వహించడ

విద్యతోనే బీసీలు శాసించే స్థాయికి!
బ్రిటిష్ నిరంకుశ పాలనకు ఎదురొడ్డి ప్రజల హక్కుల కోసం పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడు వడ్డే ఓబన్న 219వ జయంతి వేడుకలు ఆదివారం అనంతపురము నగరంలోని లలిత కళా పరిషత్ వేదికగా ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మంత్రి ఎస్. సవితమ్మ పాల్గొన్నారు. విద్యతోనే బీసీలు ఆశించే స్థాయి నుంచి శాసించే స్థాయికి చేరుకోగలరని స్పష్టంచేశారు. ప్రథమ స్వాతంత్ర్య సంగ్రామానికి ముందే బ్రిటీషర్ల దాష్టీకాలకు వ్యతిరేకంగా పోరాటం జరిపిన యోధుడు వడ్డే ఓబన్న అని వారు కొనియాడారు. అమరజీవులు వడ్డే ఓబన్న 129 వ జయంతిని రాష్ట్ర వేడుకగా నిర్వహించుకోవడం ఎంతగానో సంతోషంగా ఉందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వడ్డే ఓబన్న జయంతి రాష్ట్ర వేడుకగా ప్రకటించినప్పుడు మొదటి కార్యక్రమం గుంటూరులో నిర్వహించుకున్నామని, ఇప్పుడు అనంతపురము జిల్లాలో నిర్వహించుకోవడం సంతోషంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక బిసిల సంక్షేమం కోసం మొదట సమావేశం నిర్వహించారని, బీసీల పట్ల నిజమైన నిబద్ధత కలిగిన ప్రభుత్వం ఇదే అని అన్నారు.
Andhra Pradesh
BC Empowerment
Education for Backward Classes
Vadde Obanna Jayanti
Freedom Fighter Vadde Obanna
Anantapuram
Minister S. Savithamma
అనంతపురం
రాష్ట్ర వేడుకలు
సామాజిక న్యాయం
కూటమి ప్రభుత్వం
Scroll for the next article