News5th Dec 04:34 PMSunil Byrisetty1 min read

చదువుతోనే అద్భుతాలు

చదువు అనేదే సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. చిలకలూరిపేట స్థానిక శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మూడో మెగా పేరంట్ – టీచర్ మీటింగ్ లో డబ్బు, వస్

చదువుతోనే అద్భుతాలు
చదువు అనేదే సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అన్నారు. చిలకలూరిపేట స్థానిక శారదా జడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన మూడో మెగా పేరంట్ – టీచర్ మీటింగ్ లో డబ్బు, వస్తువులు మన దగ్గర నుంచి వెళ్లిపోవచ్చు కానీ, చదువు మాత్రం ఎప్పుడు మన దగ్గర ఉండే శక్తి అని చెప్పారు. కేవలం పాఠ్యపుస్తకాలే కాదు వ్యక్తిత్వ వికాస పుస్తకాలు, మహనీయుల చరిత్రలు, ఇతర పుస్తకాలను చదవడం ద్వారా ఉన్నతంగా ఎదగొచ్చని, జీవితాన్ని అద్భుతంగా మలుచుకోవచ్చని పేర్కొన్నారు. దీన్ని గురువులు, తల్లిదండ్రులు కూడా గుర్తుంచుకొని పిల్లలను ప్రోత్సహించాలని సూచించారు. జీవితంలో ఉన్నత శిఖరాలకు ఎదగాలంటే వినూత్నమైన ఆలోచనలు, భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చదవాలన్నారు. రామేశ్వరంలో పుట్టిన డా. ఏ.పి.జె. అబ్దుల్ కలాం ‘మిసైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా’గా ఎదిగారని, ఆయన చదువుకున్నది ఇంగ్లీష్ మీడియంలో కాదు.. తమిళ మీడియంలోనని, మార్కులు కోసం కాకుండా భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని చదివితే ఇలాంటివి అద్భుతాలు సాధించవచ్చని పేర్కొన్నారు. మెగా పీటీఎంలో పవన్ కళ్యాణ్ విద్యార్థులతో మమేకమయ్యారు. పాఠశాలలో విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలు పరిశీలించారు. స్కూల్ లైబ్రరీని పరిశీలించి విద్యార్థులకు అందుబాటులో ఉంచిన పుస్తకాలు గురించి అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు తయారుచేసిన సైన్స్ పరికరాలు, హ్యాండీక్రాఫ్ట్స్ చూసి మురిసిపోయారు. ఆటల్లో ప్రతిభ కనబరిచిన వారిని అభినందించారు. తరగతి గదిలో విద్యార్థులతో కలిసి బెంచ్ మీద కూర్చొని వారితో కాసేపు ముచ్చటించారు.
AP News
Learning Journey
Pawan Kalyan
Education Matters
Inspiration
Student Success
Mega PTM
Chilakaluripet
Abdul Kalam
School Events
Youth Inspiration
Education For All
Teachers And Parents
Scroll for the next article