Telangana18th Jan 11:59 AMSunil Byrisetty1 min read

విద్య ఒక్కటే జీవితాన్ని మార్చగలదు

లక్ష్యం ఉన్నతంగా ఉండాలని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. భాషా పరిజ్ఞానం, జ్ఞానాన్ని

విద్య ఒక్కటే జీవితాన్ని మార్చగలదు
లక్ష్యం ఉన్నతంగా ఉండాలని, ఆ లక్ష్యాన్ని సాధించేందుకు కష్టపడే తత్వాన్ని అలవర్చుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి విద్యార్థులకు పిలుపునిచ్చారు. భాషా పరిజ్ఞానం, జ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి చిత్తశుద్ధితో పనిచేయాలని సూచించారు. నిబద్ధత, క్రమశిక్షణతో కూడిన విద్యే యువతను సమాజంలో ఉన్నతంగా నిలబెడుతుందని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం చిట్టబోయినపల్లిలో ఏర్పాటు చేయనున్న రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం (IIIT) భవన నిర్మాణానికి ముఖ్యమంత్రి భూమిపూజ చేశారు. అనంతరం విద్యార్థులతో ముఖాముఖి సంభాషణ నిర్వహించి, వారు ప్రస్తావించిన అంశాలపై స్పందిస్తూ విద్యకు ఉన్న ప్రాధాన్యతను వివరించారు. ఉజ్వలమైన భవిష్యత్తు కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులందరికీ శుభాకాంక్షలు తెలియజేశారు.
Telangana
Education
Student Motivation
Telangana CM
Revanth Reddy
Importance of Education
Youth Empowerment
Discipline and Dedication
IIIT
రాజీవ్ గాంధీ విశ్వవిద్యాలయం
విద్యా అభివృద్ధి
Scroll for the next article