News12th Nov 04:02 PMSunil Byrisetty1 min read
$30 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థ లక్ష్యంగా విద్యాసంస్కరణలు
భారతదేశం త్వరలోనే $5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది, దేశాన్ని $30 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ విజన్, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకో
భారతదేశం త్వరలోనే $5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థకు చేరుకుంటుంది, దేశాన్ని $30 ట్రిలియన్ డాలర్ ఎకానమీగా తీర్చిదిద్దాలన్నది ప్రధాని నరేంద్ర మోడీ విజన్, ఆ లక్ష్యాన్ని వేగంగా చేరుకోవడానికి ఉన్నత విద్యారంగంలో సంస్కరణలు చేపట్టాలని రాష్ట్ర విద్య, ఐటీ, ఎలక్ట్రానిక్స్ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. సీఐఐ సదరన్ రీజియన్ – విట్ ఏపీ సంయుక్తంగా అమరావతిలో నిర్వహించిన హయ్యర్ ఎడ్యుకేషన్ కాంక్లేవ్ – 2025కు మంత్రి లోకేష్ ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా లోకేష్ మాట్లాడుతూ... భారతదేశాన్ని $5 ట్రిలియన్ ఆర్థిక వ్యవస్థగా మార్చేందుకు ఉన్నత విద్యను పునః రూపకల్పన చేయడం” అనే థీమ్ తో కాంక్లేవ్ ఏర్పాటుచేశారు, ఈ అంశంపై నేను ఏకీభవించడం లేదు, భారత్ త్వరలోనే $5 ట్రిలియన్ ఆర్థిక లక్ష్యాన్ని చేరుకుంటుంది, $30 ట్రిలియన్ డాలర్ ఎకానమీకి ఎలా చేరుకోవాలన్నదే ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. మానవవనరులు, మేధోసంపద లేకుండా ఆర్థికవృద్ధి సాధ్యం కాదు. ఈ మహోన్నత లక్ష్యఛేదనకు ఉన్నతవిద్యా రంగం వ్యూహాత్మక మూలస్థంభం. గత 17నెలల్లో స్పీడ్ ఆఫ్ డూయింగ్ విధానాల కారణంగా ఏపీకి $120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వచ్చాయి. త్వరలో జరగబోయే పెట్టుబడుల సదస్సులో మరో$120 బిలియన్ డాలర్ల పెట్టుబడులు రానున్నాయి. 2029 నాటికి ట్రిలియన్ డాలర్ పెట్టుబడులు మా లక్ష్యం, రాష్ట్రాలు బలంగా ఉంటే దేశం బలోపేతమవుతుంద’ని వివరించారు.