Education2nd Jan 04:51 PMSunil Byrisetty1 min read
పిల్లల భవిష్యత్తే లక్ష్యంగా విద్యా సామగ్రి పంపిణీ
శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జనవరి ఒకటిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ...జిల్లా కలెక్టర్ కు పలువురు ప్రజా ప్రతినిధులు,
శ్రద్ధతో చదివి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని జిల్లా కలెక్టర్ హిమాన్షు శుక్లా తెలిపారు. జనవరి ఒకటిన నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ...జిల్లా కలెక్టర్ కు పలువురు ప్రజా ప్రతినిధులు, అధికారులు, ప్రముఖులు అందించిన విద్యాసామగ్రిని పేద విద్యార్థులకు అందజేశారు.
జిల్లా కలెక్టర్ పంపిణీ చేసిన విద్యాసామాగ్రి, ఆహార పదార్థాలు :
లాంగ్ నోట్ పుస్తకాలు – 834, షార్ట్ నోట్ పుస్తకాలు – 368, పరీక్ష ప్యాడ్లు – 138, పెన్సిళ్లు – 180, పెన్స్ – 795, పెన్–పెన్సిల్ కాంబో బాక్స్‌లు – 40 ప్యాకెట్లు, కలర్ క్రేయాన్లు – 10 ప్యాకెట్లు, నిఘంటువులు – 262, అట్లాస్‌లు – 9, ఇంగ్లీష్ వ్యాకరణ పుస్తకాలు – 4, వాల్మీకి రామాయణం పుస్తకాలు – 7 ..వీటితో పాటు ఆపిల్స్ – 90, నారింజలు – 130, స్వీట్లు – 4 కిలోలు, కేక్ – 1 కిలో
విద్యార్థుల చదువుకు అవసరమైన పుస్తకాలు, లేఖన సామగ్రిని అందించడం ద్వారా వారి విద్యా ప్రగతికి తోడ్పాటు అందించడమే లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు కలెక్టర్ తెలిపారు.