News2nd Jun 01:50 PMSunil Byrisetty1 min read

జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి కృషి: ఇల‌క్కియ

కీల‌క‌మైన ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని.. జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి అధికారుల‌తో క‌లిసి కృషి చేస్తాన‌ని నూత‌న జాయింట్ క‌లెక

జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి కృషి: ఇల‌క్కియ
కీల‌క‌మైన ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించినందుకు చాలా ఆనందంగా ఉంద‌ని.. జిల్లా స‌మ‌గ్రాభివృద్ధికి అధికారుల‌తో క‌లిసి కృషి చేస్తాన‌ని నూత‌న జాయింట్ క‌లెక్ట‌ర్ ఎస్‌.ఇల‌క్కియ అన్నారు. జిల్లా క‌లెక్ట‌ర్ కార్యాల‌యంలోని జేసీ ఛాంబ‌ర్‌లో బాధ్య‌త‌లు స్వీక‌రించారు. ఇల‌క్కియ మాట్లాడుతూ స్వ‌ర్ణాంధ్ర @ 2047 ల‌క్ష్యాల‌కు, ప్ర‌భుత్వ ప్రాధాన్య‌త‌ల‌కు అనుగుణంగా ప్ర‌జ‌ల‌కు సేవ‌లందించ‌నున్న‌ట్లు తెలిపారు. గ‌తంలో రాజ‌మ‌హేంద్ర‌వ‌రం స‌బ్ క‌లెక్ట‌ర్‌గా, కాకినాడ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా ప‌నిచేసిన‌ట్లు తెలిపారు. ఎన్‌టీఆర్ జిల్లా జాయింట్ క‌లెక్ట‌ర్‌గా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఇల‌క్కియ‌.. క‌లెక్ట‌ర్ డా. జి.ల‌క్ష్మీశ‌ను మ‌ర్యాద‌పూర్వ‌కంగా క‌లిసి పుష్ప‌గుచ్ఛం అంద‌జేశారు.
Andhra Pradesh news
NTR District
Joint Collector
development
జాయింట్ కలెక్టర్ ఎస్.ఇలక్కియ
జిల్లా సమగ్రాభివృద్ధి
Scroll for the next article