Politics10th Mar 09:25 AMSunil Byrisetty1 min read
ఏంటీ ఖర్మ.. అనుకుంటున్న వర్మ!
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో తనకు కచ్చితంగా సీట్ వస్తుందని భావించిన ఎస్వీఎస్ఎన్ వర్మ అసహనానికి గురవుతున్నారట. ఎన్నికల ముందు కూటమి పొత్తులో భాగంగా తన పిఠాపురం సీటును పవన
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ స్థానాల భర్తీలో తనకు కచ్చితంగా సీట్ వస్తుందని భావించిన ఎస్వీఎస్ఎన్ వర్మ అసహనానికి గురవుతున్నారట.
ఎన్నికల ముందు కూటమి పొత్తులో భాగంగా తన పిఠాపురం సీటును పవన్ కు త్యాగం చేసిన విషయం తెలిసిందే.
ఆ సమయంలో ఎమ్మెల్సీ ఇస్తానని టీడీపీ అధినేత చంద్రబాబు హామీ ఇచ్చారు.
అందుకే తాజా భర్తీలో తనకు ఎమ్మెల్సీ బెర్త్ పక్కా అని వర్మ అనుకున్నారు.
అనూహ్యంగా ఖాళీ 3 స్థానాలకూ వర్మ పేరు లేకుండానే అభ్యర్థులను ప్రకటించేశారు.
ఎమ్మెల్సీ సీటు రాకపోవడంతో పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ అసహనం వ్యక్తం చేస్తున్నారు.
పార్టీ కోసం త్యాగం చేసిన తనకు తగిన శాస్తి జరిగిందని అనుచరులు దగ్గర వాపోయారట.
అంతకు మించి తాను ఇక ఏమీ మాట్లాడలేనని అంటున్నారు.