News11th Apr 09:55 AMSunil Byrisetty1 min read
వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్
అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ వడ్డించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. విద్యార్థులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించ
అంగన్వాడీ కేంద్రాల్లోని చిన్నారులకు వారానికి రెండు రోజులు ఎగ్ ఫ్రైడ్ రైస్ వడ్డించాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది.
విద్యార్థులకు మరింత రుచికరమైన, ఎక్కువ పోషకాలుండే ఆహారం అందించాలని ప్రభుత్వం ఆలోచించింది.
ఈ కేంద్రాలకు వచ్చే 3-6 ఏళ్ల వయసున్న పిల్లలకు మధ్యాహ్న భోజనం మెనూలో మార్పులు చేయనుంది.
వారంలో రెండు రోజులు మధ్యాహ్నం వేళ ఎగ్ ఫ్రైడ్ రైస్, అదేరోజు ఉదయం అల్పాహారంగా ఉడికించిన శనగలు అందించనుంది.
అన్ని కూరలు, పప్పులో మునగ పొడిని వినియోగించనుంది.
చిన్నారులకు ఇలాంటి ఆహారం అందించడం ద్వారా ఎదుగుదలకు తోడ్పాటు కానుంది