News16th Jul 12:19 PMSunil Byrisetty1 min read

గుడ్డు.. గుభేల్!

కోడిగుడ్డు ధర రికార్డు స్థాయికి చేరింది. గత డిసెంబరులో కోళ్ల ఫారాల వద్ద గుడ్డు ధర రూ.6.95 పైసలు ఉండగా గురువారం ఇదే ధరకు చేరి ఆ రికార్డుకు సమానమైంది. సాధారణంగా తూర్పు గోదావరి జిల్లా

గుడ్డు.. గుభేల్!
కోడిగుడ్డు ధర రికార్డు స్థాయికి చేరింది. గత డిసెంబరులో కోళ్ల ఫారాల వద్ద గుడ్డు ధర రూ.6.95 పైసలు ఉండగా గురువారం ఇదే ధరకు చేరి ఆ రికార్డుకు సమానమైంది. సాధారణంగా తూర్పు గోదావరి జిల్లాలో 1.30 కోట్లకుపైగా కోళ్లు ఉండగా రోజుకి కోటి వరకు గుడ్లు ఉత్పత్తి అవుతాయి. అయితే ఈ ఏడాది ఎండల తీవ్రత అధికంగా ఉండడం వల్ల అధికారికంగా 16.35లక్షలు, అనధికారికంగా 20 లక్షలకుపైగా కోళ్లు మృతి చెందాయని రైతులు చెబుతున్నారు. మిగిలిన కోళ్లు పూర్తిస్థాయిలో గుడ్లు పెట్టకపోవడంతో గుడ్లు కొరత ఏర్పడింది. ప్రస్తుతం కోళ్ల ఫారంల వద్ద గుడ్డు ధర రూ.6.95 పైసలు ఉండగా బహిరంగ మార్కెట్లో రూ.8.50 పైసలకుపైనే విక్రయిస్తున్నారు. గత ఏడాది ఇదే రోజున రూ.4.90 పైసలు ఉండడం గమనార్హం.
Andhra Pradesh
Egg Prices
Poultry
East Godavari
Heatwave
Egg Shortage
గుడ్ల కొరత
మార్కెట్ ధరలు
పౌల్ట్రీ రైతులు
వ్యవసాయం
Scroll for the next article