News21st Dec 04:14 PMSunil Byrisetty1 min read
గుడ్డు గుభేల్.. ధరలకు రెక్కలు!
మార్కెట్లో కోడి గుడ్డు ధరలు 'పుంజు'కున్నాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 వరకు పలికిన కోడి గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే ఒక్
మార్కెట్లో కోడి గుడ్డు ధరలు 'పుంజు'కున్నాయి. కొద్ది నెలల క్రితం బహిరంగ మార్కెట్‌లో రూ.5 నుంచి రూ.6 వరకు పలికిన కోడి గుడ్డు ధర ప్రస్తుతం రూ.8కు చేరింది. హోల్‌సేల్ మార్కెట్‌లోనే ఒక్కో కోడి గుడ్డు రూ.7.30పై పలుకుతోంది. పౌల్ర్టీ రంగ చరిత్రలోనే ఇదే రికార్డు ధరని చెబుతున్నారు. గతంలో 30 కోడిగుడ్లు రూ.160-170 వరకు విక్రయించేవారు. 10 రోజులుగా 30 కోడి గుడ్లను రూ. 210-220 వరకు హోల్‌సెల్ మార్కెట్‌లోనే విక్రయిస్తున్నారు. నాటు కోడి గుడ్లు అయితే ఒక్కో గుడ్డును రూ.15 వరకు విక్రయిస్తున్నారు. డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడం వల్లే కోడి గుడ్ల ధరలు పెరిగిపోతున్నాయని పౌల్ట్రీ పరిశ్రమ ప్రతినిధులు చెబుతున్నారు. గతంలో తెలుగు రాష్ట్రాల్లో కలిపి రోజుకు సుమారు 8 కోట్ల గుడ్లు ఉత్పత్తి అయ్యేవి.