News17th Sep 11:16 AMSunil Byrisetty1 min read

ఎలినినో ఎఫెక్ట్.. విద్యుత్ శాఖపై 20 శాతం అధిక డిమాండ్

విద్యుత్ శాఖపై ఎలినినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్లు అధికంగా డిమాండ్ ఉందన్నారు. గత సంవత్సరం ఈ సమయంల

ఎలినినో ఎఫెక్ట్.. విద్యుత్ శాఖపై 20 శాతం అధిక డిమాండ్
విద్యుత్ శాఖపై ఎలినినో ఎఫెక్ట్ తీవ్రంగా ఉందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ పేర్కొన్నారు. వేసవిని తలపించే ఎండల వల్ల 50 మిలియన్ యూనిట్లు అధికంగా డిమాండ్ ఉందన్నారు. గత సంవత్సరం ఈ సమయంలో 240 మిలియన్ యూనిట్ల డిమాండ్ ఉంటే ఈసారి అది 290 మిలియన్ యూనిట్లకు వెళ్ళిందన్నారు. విద్యుత్ జనరేషన్ కంపెనీలన్నీ పూర్తిస్థాయిలో పనిచేస్తున్నాయన్నారు. థర్మల్ పవర్ స్టేషన్ లలో 15 రోజులకు సరిపడా బొగ్గు నిల్వలు ఉంచామని తెలిపారు. కొన్ని సాంకేతిక సమస్యలు వచ్చినా అధిగమిస్తున్నామని పేర్కొన్నారు. వర్షాలు లేకపోవడంతో హైడల్ విద్యుత్తు పూర్తిగా జీరో అయిందన్నారు. ప్రజలకు, వ్యవసాయానికి, పరిశ్రమలకు ఎటువంటి అవాంతరాలు లేకుండా చూడాలని ముఖ్యమంత్రి ఆదేశించారని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 20 శాతం అధికంగా డిమాండ్ వచ్చిందన్నారు. డిమాండ్ ను బట్టి బహిరంగ మార్కెట్లో విద్యుత్ కొనుగోలు చేస్తున్నామన్నారు. ఎలినినో ఎఫెక్ట్ అన్ని రాష్ట్రాల్లో ఉందని, ఆ రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ పరిస్థితి కొంత మెరుగని మంత్రి పేర్కొన్నారు.
Andhra Pradesh
AP News
AP Electricity
Power Demand
El Nino
El Nino Effect
Electricity Department
Gottipati Ravikumar
Power Sector
AP Power Sector
థర్మల్ పవర్
హైడల్ పవర్
బొగ్గు నిల్వలు
విద్యుత్ ఉత్పత్తి
ఏపీ ప్రభుత్వం
విద్యుత్ సరఫరా
వేసవి ఎండలు
Scroll for the next article