News11th Sep 10:35 AMSunil Byrisetty1 min read
ఎల్‌నినో ప్రభావంతో వేసవి స్థాయిలో విద్యుత్ వినియోగం
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో విద్యుత్ పరిస్థితిపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం ర
ఎల్‌నినో ప్రభావంతో రాష్ట్రంలో విద్యుత్ డిమాండ్ గణనీయంగా పెరిగిన నేపథ్యంలో విద్యుత్ పరిస్థితిపై ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. ప్రస్తుతం రాష్ట్రంలో విద్యుత్ వినియోగం వేసవిని తలపించే స్థాయిలోనే కొనసాగుతోందని అధికారులు మంత్రికి వివరించారు. ప్రస్తుతం రోజుకు 280 నుంచి 290 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్ వినియోగం నమోదవుతోందని తెలిపారు. దక్షిణాది రాష్ట్రాలన్నింటిలోనూ ఇదే తరహా పరిస్థితులు నెలకొన్నాయని మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. వాతావరణ పరిస్థితుల కారణంగా విద్యుత్ డిమాండ్ మరింత పెరిగే అవకాశం ఉన్నందున ముందస్తు ప్రణాళికతో వ్యవహరించాలని మంత్రి గొట్టిపాటి సూచించారు. విద్యుత్ డిమాండ్‌కు అనుగుణంగా ముందుగానే విద్యుత్‌ను కొనుగోలు చేయాలని అధికారులను మంత్రి గొట్టిపాటి ఆదేశించారు. అవసరమైన విద్యుత్‌ను ముందస్తుగా సమకూర్చుకోవడం ద్వారా భవిష్యత్తులో కొరత ఏర్పడకుండా చర్యలు చేపట్టాలని సూచించారు. విద్యుత్ డిమాండ్, సరఫరా పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని అధికారులకు స్పష్టం చేశారు.