News20th Aug 04:12 PMSunil Byrisetty1 min read
యూపీఎస్సీ సివిల్స్ మెయిన్స్‌కు పటిష్ట ఏర్పాట్లు
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) సివిల్ సర్వీసెస్ మెయిన్ పరీక్షలు ఈ నెల 21వ తేదీ నుంచి 30వ తేదీ వరకు జరుగుతాయని.. ఈ నేపథ్యంలో పటిష్ట ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ డా. జి.లక్ష్మీశ అన్నారు.
ఈ నెల 21న పేపర్-1 ఎస్సే, 22న జీఎస్-1, జీఎస్-2, 23న జీఎస్-3, జీఎస్-4, 29న భారతీయ భాష, ఇంగ్లిష్, 30వ తేదీన ఆప్షనల్ సబ్జెక్టులకు ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 2.30 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. పరీక్ష కేంద్రంలో బందోబస్తు, తాగునీరు, నిరంతర విద్యుత్ సరఫరా, వైద్య శిబిరం తదితరాలకు సంబంధించి ఆయా శాఖల అధికారులు అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా అభ్యర్థుల ముఖ ఆధారిత గుర్తింపు ప్రక్రియ విషయంలో జాగ్తత్తగా వ్యవహరించాలన్నారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు సకాలంలో చేరుకునే విధంగా వివిధ ప్రాంతాల నుంచి పరీక్షా కేంద్రానికి బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రజారవాణా శాఖ అధికారులను ఆదేశించారు. పరీక్ష నిర్వహణకు సంబంధించి 91549 70454 నంబరులో సంప్రదించాలి.