News13th Nov 02:55 PMSunil Byrisetty1 min read
పంచాయతీ ఎన్నికల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
చిత్తూరు జిల్లాలో పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్
చిత్తూరు జిల్లాలో పట్టణ స్థానిక సంస్థలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికల ప్రక్రియ పూర్తయిన నేపథ్యంలో గ్రామ పంచాయతీ ఎన్నికలను మూడు విడతల్లో ప్రశాంతంగా, పారదర్శకంగా నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ తెలిపారు. కలెక్టరేట్లో జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్, జిల్లాలో వివిధ పంచాయతీ ఎన్నికల జాబితా ప్రకటించారు. గ్రామ పంచాయతీ ఎన్నికలకు సంబంధించి తొలి విడత నోటిఫికేషన్ జారీతో ఎన్నికల ప్రక్రియ ప్రారంభం కానుందని తెలిపారు. జిల్లాలోని మండలాలను మూడు విడతలుగా విభజించి ఎన్నికల నిర్వహణకు ప్రణాళిక రూపొందించినట్లు పేర్కొన్నారు. తొలి విడతలో పలమనేరు నియోజకవర్గంలోని 6 మండలాలు, కుప్పం నియోజకవర్గంలోని 3 మండలాలు కలిపి మొత్తం 9 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రెండో విడతలో పూతలపట్టు నియోజకవర్గంలోని 5 మండలాలు, పుంగనూరు నియోజకవర్గంలోని 2 మండలాలు, నగరి నియోజకవర్గంలోని 3 మండలాలు కలిపి మొత్తం 10 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు వివరించారు. మూడో విడతలో జి.డి. నెల్లూరు నియోజకవర్గంలోని 6 మండలాలు, చిత్తూరు నియోజకవర్గంలోని చిత్తూరు రూరల్, గుడిపాల మండలాలు కలిపి మొత్తం 8 మండలాల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్లు తెలిపారు.