News29th Oct 04:44 PMSunil Byrisetty1 min read

పుంగనూరు అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి

అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి కౌన్సిలర్లకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సహచర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పుంగనూరు టీడీపీ

పుంగనూరు అభివృద్ధి కోసం కూటమి అభ్యర్థులను గెలిపించాలి
అన్నమయ్య జిల్లా పుంగనూరు మున్సిపాలిటీలో ఏకగ్రీవంగా ఎన్నికైన కూటమి కౌన్సిలర్లకు రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి, సహచర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డితో కలిసి పుంగనూరు టీడీపీ కార్యాలయంలో ఎన్నికల ధ్రువీకరణ పత్రాలను అందజేసి అభినందనలు తెలిపారు. ప్రజాప్రతినిధులుగా ఏకగ్రీవంగా ఎన్నికైన కౌన్సిలర్లకు శుభాకాంక్షలు తెలియజేస్తూ, ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకుని పుంగనూరు అభివృద్ధికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. పుంగనూరు నియోజకవర్గ అభివృద్ధి, గ్రామీణ ప్రాంతాల ప్రగతి, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కూటమి అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని ప్రజలకు పిలుపునిచ్చారు. ప్రజల ఓటు హక్కును కాపాడుతూ, గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు. గత మూడు దశాబ్దాలుగా పుంగనూరులో కొనసాగిన రాజకీయ పరిస్థితులను ప్రజలు గమనిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. గతంలో ప్రజలకు స్వేచ్ఛగా ఓటు వేసే అవకాశం కూడా లేని పరిస్థితులు ఉండేవని, ప్రస్తుతం ప్రజాస్వామ్యాన్ని పరిరక్షిస్తూ ప్రజలు తమ ఓటు హక్కును స్వేచ్ఛగా వినియోగించుకునే వాతావరణం ఏర్పడిందని తెలిపారు. రాబోయే ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల్లో ప్రజలు స్వేచ్ఛగా తమ నిర్ణయాన్ని వెల్లడించి, అభివృద్ధికి బాటలు వేయాలని కోరారు.
Scroll for the next article