Politics21st Oct 04:51 PMSunil Byrisetty1 min read
కూటమిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ అభివృద్ధి
స్థానిక సంస్థల్లో కూటమిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ తరహా అభివృద్ధి, సంక్షేమ పాలన ప్రజలకు అందుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వైసీపీతో రాష్ట్రానికి జరిగిన నష
స్థానిక సంస్థల్లో కూటమిని గెలిపిస్తే ట్రిపుల్ ఇంజన్ తరహా అభివృద్ధి, సంక్షేమ పాలన ప్రజలకు అందుతుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. వైసీపీతో రాష్ట్రానికి జరిగిన నష్టంతో పాటు కూటమి ప్రభుత్వంలో జరిగిన రెండేళ్ల అభివృద్ధి, సంక్షేమాన్ని గడపగడపకూ తీసుకువెళ్లాలని పిలుపునిచ్చారు. అమరావతి రాజధాని నుంచి గ్రామ స్థాయి వరకు జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమాన్ని అడ్డుకునే వైఎస్సార్ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే నష్టపోతామని పేర్కొన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో పశ్చిమ గోదావరి జిల్లాలో నూరుశాతం కూటమి విజయానికి అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. కూటమి తరపున పోటీచేసే ఎంపిటిసి, జడ్పీటిసి అభ్యర్దులకు కండువాలు కప్పి అభినందించారు.