News18th Oct 04:05 PMSunil Byrisetty1 min read

కడపలో పంజాబ్ రౌడీలు.. 70 మందిపై కేసులు

కడపలో పంజాబ్ రౌడీలు హల్ చల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలపై కడప పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కడప గాంధీనగర్ పాఠశాల వద్ద జరిగిన ర

కడపలో పంజాబ్ రౌడీలు.. 70 మందిపై కేసులు
కడపలో పంజాబ్ రౌడీలు హల్ చల్ చేశారు. మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల సందర్భంగా చోటుచేసుకున్న ఘర్షణలపై కడప పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ క్రమంలో కడప గాంధీనగర్ పాఠశాల వద్ద జరిగిన రాళ్లదాడి ఘటన, ఎర్ర ముక్కపల్లెలో వాహనాల ధ్వంసం, కారు దగ్ధం కేసుల్లో మొత్తం 70 మందికిపైగా వైసీపీ నేతలపై వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదయ్యాయి. రాయచోటిలో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హత్యకు పన్నిన కుట్ర వెలుగులోకి రాగా.. పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేసి, నిందితుల నుంచి మారణాయుధాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ ఘటనలో రాయచోటి వైసీపీ మున్సిపల్ ఛైర్మన్ అభ్యర్థి షరీఫ్ జిన్నాతో పాటు 15 మందిపై కేసులు నమోదయ్యాయి. పంజాబ్లోని పఠాన్ కోట్ కు చెందిన రౌడీలు, కర్నూలు ప్రాంతానికి చెందిన మరికొందరిని వైసీపీ ఛైర్మన్ అభ్యర్థి జిన్నా షరీఫ్ రాయచోటికి తీసుకుచ్చినట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో గుర్తించినట్లు సమాచారం.
Scroll for the next article