Politics13th Mar 11:27 AMSunil Byrisetty1 min read

ఓటర్, ఆధార్ లింక్ తప్పనిసరి?

బోగస్ ఓటర్లను తొలగించడంతోపాటు ఓటర్ల గుర్తింపు సక్రమంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించింది. ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్‌, మొబైల్‌ నంబర్లతో లింక్‌ చేయాలని ఆదేశ

ఓటర్, ఆధార్ లింక్ తప్పనిసరి?
బోగస్ ఓటర్లను తొలగించడంతోపాటు ఓటర్ల గుర్తింపు సక్రమంగా జరిగేందుకు కేంద్ర ఎన్నికల కమిషన్ చర్యలు ప్రారంభించింది. ఓటరు గుర్తింపు కార్డులను ఆధార్‌, మొబైల్‌ నంబర్లతో లింక్‌ చేయాలని ఆదేశించింది. అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల ముఖ్య ఎన్నికల అధికారులకు సర్క్యులర్‌ను ఈసీఐ జారీ చేసింది. ఈ నెల 4న నిర్వహించిన సీఈవోల కాన్ఫరెన్స్‌లో 'ఓపెన్‌ రిమార్క్స్‌ ఆఫ్‌ సీఈసీ' పేరిట సీఈవోలందరికీ పంపిణీ చేసిన పత్రాల్లోనూ అవే ఆదేశాలు ఉన్నాయని పేర్కొంది. 'ఓటర్ల గుర్తింపు సక్రమంగా ఉండేందుకు ఓటరు కార్డుతో ఆధార్‌, మొబైల్‌ నంబర్లను అనుసంధానించే అన్ని ప్రయత్నాలూ చేయాలని సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. అలాగే జనన, మరణాల నమోదు అధికారులతో సమన్వయం చేసుకొంటూ ఎప్పటికప్పుడు ఓటర్ల జాబితాను అప్‌డేట్‌ చేస్తుండాలని కూడా సీఈసీ నిర్దేశించింది. 18 ఏళ్ల వయసు దాటిన భారత పౌరులందరూ తప్పనిసరిగా ఓటర్లుగా నమోదై ఉండేలా ఇంటింటి సర్వే సమయంలో అందరు బీఎల్‌వోలూ(బూత్‌ స్థాయి అధికారులు) కృషి చేయాలని సీఈసీ ఆదేశించారు. కాగా, ఓటరు నమోదుకు ఆధార్‌ లింక్‌ తప్పనిసరి కాదని 2022లో సుప్రీంకోర్టుకు ఇచ్చిన వివరణలో ఈసీఐ స్పష్టం చేసింది. దానికి భిన్నంగా తాజా ఆదేశాలు ఉన్నాయి
Aadhar card
Vote Election commission
India
ఆధార్కార్డ్
ఓటు ఎన్నికల సంఘం భారతదేశం
Scroll for the next article