Entertainment4th Sep 05:42 PMSunil Byrisetty1 min read
టాలీవుడ్‌లో ఎన్నికల వేడి
టాలీవుడ్‌లో తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నెల 6న ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్నాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య పోటీ ఉండనుంది.
టాలీవుడ్‌లో తెలుగు నిర్మాతల మండలి ఎన్నికల వేడి రాజుకుంది. ఈ నెల 6న ఫిల్మ్ ఛాంబర్ ఆవరణలో నిర్మాతల మండలి ఎన్నికలు జరగనున్నాయి. ప్రోగ్రెసివ్ ప్యానెల్, మన ప్యానెల్ మధ్య పోటీ ఉండనుంది. ఇప్పటికే ప్రోగ్రెసివ్ ప్యానెల్ మ్యానిఫెస్టోను విడుదల చేసింది. ప్రోగ్రెసివ్ ప్యానెల్‌కు అల్లు అరవింద్, సురేష్ బాబు, దిల్ రాజు మద్దతు పలుకుతున్నారు. మరోవైపు మన ప్యానెల్‌కు చదలవాడ శ్రీనివాస రావు మద్దతునిస్తున్నారు. ప్రోగ్రెసివ్ ప్యానెల్ మ్యానిఫెస్టోలో నిర్మాతల సంక్షేమం, ఆరోగ్య బీమా, మహిళల భద్రత, టికెట్ ధరల విషయంలో హామీ ఇవ్వడం ఆకట్టుకుంటోంది.