Politics8th Nov 03:40 PMSunil Byrisetty1 min read

అక్కడే ఎన్నికల కోడ్!

గ్రామీణ ప్రాంతాల్లో మినహా మిగతా రాష్ట్ర మంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల

అక్కడే ఎన్నికల కోడ్!
గ్రామీణ ప్రాంతాల్లో మినహా మిగతా రాష్ట్ర మంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఎత్తివేస్తూ ఎస్ఈసీ ఉత్తర్వులు ఇచ్చింది. రాష్ట్రంలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీలు, నగర పంచాయతీల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ ఇప్పటికే పూర్తి అయింది. అలాగే మండల పరిషత్, జిల్లా పరిషత్ల ఎన్నికల నిర్వహణ ప్రక్రియ శనివారంతో ముగిసింది. దీంతో గ్రామీణ ప్రాంతాలు మినహా మిగతా రాష్ట్రమంతటా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలును ఈనెల 7వతేది శనివారం రాత్రి 10 గం.ల నుండి ఎత్తివేస్తూ రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా రాష్ట్రంలో గ్రామ పంచాయతీలకు ఎన్నికల నిర్వహణ ప్రక్రియ కొనసాగుతోంది. అందువల్ల రాష్ట్ర వ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి యదావిధిగా అమలులో ఉంటుందని ఎస్ఇసి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Scroll for the next article