Politics17th Oct 05:33 PMSunil Byrisetty1 min read

ఎన్నికల కోడ్: నిబంధనలేంటంటే?

ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఏం చేయకూడదో, ఏం చేయొచ్చనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, పోస్టర్లు

ఎన్నికల కోడ్: నిబంధనలేంటంటే?
ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన తర్వాత ఏం చేయకూడదో, ఏం చేయొచ్చనే నిబంధనలు స్పష్టంగా ఉన్నాయి. ప్రభుత్వ భవనాలు, విద్యుత్ స్తంభాలు, బహిరంగ ప్రదేశాల్లో ఎలాంటి రాజకీయ ఫ్లెక్సీలు, పోస్టర్లు, బ్యానర్లు, వాల్ రాతలు ఉండరాదు. ఓటర్లకు నగదు, మద్యం, బహుమతులు పంచడం లేదా ఉచితంగా వస్తువుల పంపిణీ చేయడం తీవ్ర నేరం. కులాల, మతాల మధ్య విద్వేషాలు రేకెత్తించేలా లేదా వ్యక్తిగత దూషణలతో ప్రసంగాలు చేయకూడదు. ప్రార్థనా మందిరాలను (గుడులు, మసీదులు, చర్చీలు) ప్రచార వేదికలుగా వాడరాదు. అధికార పక్షం వారు ప్రభుత్వ వాహనాలు, నిధులు, భవనాలను లేదా ప్రభుత్వ పథకాల ప్రచారాలను ఎన్నికల ప్రయోజనాల కోసం ఉపయోగించకూడదు. ఓటర్లను ఆకట్టుకునేలా కొత్త ప్రభుత్వ పథకాలు, శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు లేదా కొత్త నిధుల మంజూరు చేయకూడదు. రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మైకులు, లాడ్‌స్పీకర్లు వాడకూడదు. పగటిపూట కూడా ముందస్తు అనుమతి తప్పనిసరి. సరైన ఆధారాలు, పత్రాలు లేకుండా రూ. 50,000 కంటే ఎక్కువ నగదును రవాణా చేయకూడదు.
Scroll for the next article