Politics1st Nov 03:30 PMSunil Byrisetty1 min read

ఎన్నికల పర్యవేక్షణకు 13,500 సీసీ కెమెరాల వెబ్‌కాస్టింగ్‌

వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ, కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు

ఎన్నికల పర్యవేక్షణకు 13,500 సీసీ కెమెరాల వెబ్‌కాస్టింగ్‌
వెబ్‌కాస్టింగ్‌ ద్వారా ఎన్నికల ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠ, కార్యదర్శి డాక్టర్ ఏ. మల్లిఖార్జున పరిశీలించారు. ఎన్నికల ప్రక్రియను నిరంతరం పర్యవేక్షించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఏర్పాటు చేసిన 13,500 సీసీ కెమెరాల వెబ్‌కాస్టింగ్‌ పనితీరును పరిశీలించారు.రాష్ట్ర ఎన్నికల కమిషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన వెబ్‌కాస్టింగ్‌ పర్యవేక్షణ వ్యవస్థ ద్వారా వివిధ జిల్లాల్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల పనితీరును వారు ప్రత్యక్షంగా వీక్షించారు. కెమెరాల ద్వారా పోలింగ్‌ కేంద్రాల్లో జరుగుతున్న ఎన్నికల ప్రక్రియను ఎలా పర్యవేక్షిస్తున్నారు, వెబ్‌కాస్టింగ్‌ వ్యవస్థ ఏ విధంగా పనిచేస్తోంది అనే అంశాలను మీడియా కు వివరించారు. ఈ సందర్భంగా రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 13,500 సీసీ కెమెరాలను ఏయే జిల్లాల్లో, ఎన్ని పోలింగ్‌ కేంద్రాల్లో ఏర్పాటు చేశారు, వాటి ద్వారా ఎన్నికల ప్రక్రియను ఏ విధంగా పర్యవేక్షిస్తున్నారనే వివరాలను అధికారులు కమిషనర్‌కు వివరించారు.
Scroll for the next article