Politics6th Nov 10:35 AMSunil Byrisetty1 min read
పెండింగ్ మున్సిపాలిటీలకు వారంలో నోటిఫికేషన్!
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పెండింగ్ ఉన్న వాటిపై ఎస్ఈసీ దృష్టి పెట్టింది. పెండింగ్లో ఉన్న 23 అర్బన్ లోకల్ బాడీల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మేయర్/ఛైర్పర్సన్,
రాష్ట్రంలో పట్టణ స్థానిక సంస్థల ఎన్నికల్లో పెండింగ్ ఉన్న వాటిపై ఎస్ఈసీ దృష్టి పెట్టింది. పెండింగ్లో ఉన్న 23 అర్బన్ లోకల్ బాడీల ఎన్నికల నిర్వహణకు సర్వం సిద్ధమైంది. మేయర్/ఛైర్పర్సన్, డివిజన్లు/వార్డు స్థానాలకు రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తయింది. ఈనెల 10 నుంచి 12 మధ్య ఎన్నికల నోటిఫికేషన్ వెలువడనుంది. 25వ తేదీలోపు మొత్తం ప్రక్రియను పూర్తిచేసే అవకాశం ఉంది. ఈ పట్టణ స్థానిక సంస్థలకు సంబంధించిన కేసులు హైకోర్టులో పెండింగ్లో ఉండటంతో అక్టోబర్ 14న జారీ చేసిన ఎన్నికల నోటిఫికేషన్లో వీటి ప్రస్తావన లేదు. కేసుల పరిష్కారంతో వీటిలో ఎన్నికల నిర్వహణకు పురపాలకశాఖ అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. డివిజన్లు/వార్డుల పునర్విభజన, ఓటర్ల జాబితాల తయారీ, వీటిలో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళల గుర్తింపు ప్రక్రియను పూర్తిచేసిన యంత్రాంగం.. తాజాగా రిజర్వేషన్లు ఖరారు చేసింది.