Politics12th Nov 02:21 PMSunil Byrisetty1 min read

23 మున్సిపల్.. 26న పోలింగ్

ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల కోడ్ కూత పెట్టింది. పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల

23 మున్సిపల్.. 26న పోలింగ్
ఆంధ్రప్రదేశ్‌లో మరోసారి ఎన్నికల కోడ్ కూత పెట్టింది. పెండింగ్‌లో ఉన్న 23 పట్టణ స్థానిక సంస్థల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. ఈ నెల 14 నుంచి 16 వరకు నామినేషన్ల స్వీకరణ, 17న నామినేషన్ల పరిశీలన, 19న ఉపసంహరణకు గడువు ప్రకటించింది. ఈ నెల 26న పోలింగ్, 30న ఓట్ల లెక్కింపు జరగనున్నట్లు వెల్లడించారు. ఇదే రోజు తొలి విడత సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కూడా జరగనుంది. ఈ మేరకు ఎస్ఈసీ అనిల్ చంద్ర పునేఠా షెడ్యూల్ విడుదల చేశారు. సర్పంచ్ ఎన్నికలకు సంబంధించిన నోటిఫికేషన్ రేపు విడుదల కానుంది.
Scroll for the next article