Politics15th Oct 03:03 PMSunil Byrisetty1 min read

గెలిస్తే మంచిది, లేదంటే విమర్శలా.. జగన్ పై బీజేపీ ఫైర్

సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్‌ల అరెస్టులపై సానుభూతి వ్యక్తం చేస్తూ, ఎన్నికల వ్యవస్థపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు

గెలిస్తే మంచిది, లేదంటే విమర్శలా.. జగన్ పై బీజేపీ ఫైర్
సీజేపీ నాయకులు సౌరవ్ దాస్, అశుతోష్‌ల అరెస్టులపై సానుభూతి వ్యక్తం చేస్తూ, ఎన్నికల వ్యవస్థపై వైఎస్సార్‌సీపీ అధినేత జగన్ చేసిన ట్వీట్‌కు ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య శాఖ మంత్రి, బీజేపీ నాయకుడు సత్యకుమార్ యాదవ్ గట్టి కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా జగన్ ఎక్స్ పోస్ట్‌పై స్పందిస్తూ.. 'ఓడిపోయిన పార్టీలన్నీ ఇప్పటికే ఇందులో వేలు పెట్టాయి కాబట్టి, నువ్వు ఎప్పుడు వస్తావా అని నేను ఎదురుచూస్తున్నాను' అని ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రక్రియపై విశ్వసనీయతను పునరుద్ధరించాలన్న జగన్ వ్యాఖ్యలను ప్రశ్నిస్తూ.. 'ఇంతకీ ఏ ఎన్నికల ప్రక్రియ గురించి మాట్లాడుతున్నావు? నువ్వు 151 శాసనసభ స్థానాలు, 22 లోక్‌సభ స్థానాలు గెలుచుకున్న 2019 ఎన్నికల గురించా?' అని సత్యకుమార్ నిలదీశారు. ఆ సమయంలో కూడా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్ ఇవేనని గుర్తుచేసిన ఆయన.. జగన్ గెలిస్తేనేమో ఎన్నికల ప్రక్రియ సరైనదని, ఓడిపోతే మాత్రం విమర్శలు చేయడం ఏంటని ప్రశ్నించారు. అలాగే, బెయిల్ నిబంధనలను ఉల్లంఘించి, న్యాయవ్యవస్థను అవమానించిన వారిని అదుపులోకి తీసుకోవడాన్ని జగన్ తప్పుపట్టడాన్ని ఆయన విమర్శించారు. జగన్ పాలనలో ఆయనకు వ్యతిరేకంగా మాట్లాడినందుకే ఎంతోమందిని అన్యాయంగా జైలుకు పంపారని ఆరోపించారు. 'నీ పాలనలో బాధితులుగా మారిన వారి జాబితాను నన్ను తయారు చేయమంటావా?' అని సత్యకుమార్ ఎక్స్ వేదికగా నిలదీశారు."
Scroll for the next article