Politics28th Mar 11:50 AMSunil Byrisetty1 min read
కూటమి కుట్రలకు ఎదురొడ్డి గెలిచారు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 52 స్థానిక సంస్థల్లో జెడ్పి చైర్మన్,మండల చైర్మన్, వైస్ ఎంపీపీల ఎన్నికలు
ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వచ్చిన ఉప ఎన్నికల్లో ఊహించని పరిణామాలు చోటు చేసుకున్నాయి.
రాష్ట్రవ్యాప్తంగా 52 స్థానిక సంస్థల్లో జెడ్పి చైర్మన్,మండల చైర్మన్, వైస్ ఎంపీపీల ఎన్నికలు జరిగాయి.
అధికార పార్టీ కిడ్నాపులు, ప్రలోభాలు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలులో ఉన్న పరిస్థితుల్లో కూడా వైయస్సార్సీపీ నాయకులు రొమ్మువిరిచి ఎదురొడ్డి నిలబడి ఈ 52 స్థానాల్లోని 30 స్థానాలలో గెలుపొందారని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర డాక్టర్ల ప్రధాన ప్రతినిధి డా. చింతలపూడి అశోక్ కుమార్ తెలిపారు.
ఇక కేవలం 11 స్థానాల్లో మాత్రమే టీడీపీ, ఒక స్థానంలో మాత్రమే జనసేన గెలుపొందాయని చెప్పారు.
మిగతా 10 స్థానాలను కోరం లేదని వాయిదా వేయించారని వివరించారు.
ఈ గెలుపులో వైఎస్ జగన్ మీద అభిమానంతో పార్టీ మీద నమ్మకంతో నిలబడి గెలిచిన, గెలిపించిన వైయస్సార్సీపీ నాయకులందరికీ కృతజ్ఞతలు తెలియజేశారు.