Politics14th Nov 03:08 PMSunil Byrisetty1 min read
బాపట్ల జిల్లాలోని 351 గ్రామ పంచాయతీలకు ఎన్నికలు
బాపట్ల జిల్లాలోని 351 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ప్రకటించారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మొత
బాపట్ల జిల్లాలోని 351 గ్రామ పంచాయతీలకు మూడు దశల్లో ఎన్నికలు జరుగుతాయని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్.వి, ప్రకటించారు. గ్రామపంచాయతీ ఎన్నికల ప్రకటన విడుదల చేసిన నేపథ్యంలో మొత్తం 3,362 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయని కలెక్టర్ స్పష్టం చేశారు. ఇందు కొరకు 3,770 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశామన్నారు. 4,23,910 మంది పురుష ఓటర్లు ఉండగా, 4,43,995 మంది మహిళ ఓటర్లు ఉన్నారని, 49 మంది ఇతరులు ఉన్నారన్నారు. గ్రామ పంచాయితీలలో మొత్తం 8,67,954 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. మొదటి దశలో పర్చూరు నియోజకవర్గంలోని ఇంకొల్లు, చిన్నగంజాం, కారంచేడు, మార్టూరు, పర్చూరు, యద్దనపూడి మండలాలకు ఎన్నికలు జరుగుతాయన్నారు. రెండో దశలో వేమూరు, చీరాల నియోజకవర్గాల్లోని అమృతలూరు, భట్టిప్రోలు, చుండూరు, కొల్లూరు, వేమూరు, చీరాల, వేటపాలెం మండలాలలో ఎన్నికలు జరుగుతాయన్నారు. మూడో విడతలో బాపట్ల, రేపల్లె నియోజకవర్గాల్లోని బాపట్ల, కర్లపాలెం, పిట్టలవానిపాలెం, రేపల్లె, నిజాంపట్నం, చెరుకుపల్లి, నగరం మండలాలకు ఎన్నికలు నిర్వహిస్తామన్నారు.