News6th Apr 11:18 AMSunil Byrisetty1 min read
ఏపీకి కేంద్రం బంపరాఫర్.. భారీ ప్రాజెక్ట్‌కు ఆమోదం!
ఏపీకి కేంద్రం వరాలు ప్రకటిస్తోంది. ఏపీలోని 11 నగరాల్లో 1050 బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది. ముందుగా 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటోంది. కన్వర్జెన
ఏపీకి కేంద్రం వరాలు ప్రకటిస్తోంది.
ఏపీలోని 11 నగరాల్లో 1050 బస్సులను ప్రవేశపెట్టాలని నిర్ణయించింది.
ముందుగా 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెట్టడానికి చర్యలు తీసుకుంటోంది. కన్వర్జెన్స్ ఎనర్జీ సర్వీస్ లిమిటెడ్, విద్యుత్ మంత్రిత్వ శాఖ, గోల్, ప్రారంభ దశలో రానున్న 750 ఈ బస్సుల కోసం టెండర్లు పిలిచి అర్హత కలిగిన సంస్థల కాంట్రాక్టులను ఖరారు చేసింది.
టెండర్లలో పుణెకు చెందిన పిన్నాకిల్ మొబిలిటీ సెల్యూషన్స్ సంస్థ L1 గా నిలిచిన రాష్ట్రంలో ఈ బస్సులు తిప్పే కాంట్రాక్టు దక్కించుకుంది.
నగరాల్లో 12 మీటర్లు, 9 మీటర్ల పొడవు ఉన్న రెండు విభాగాల్లో విద్యుత్‌తో నడిచే ఏసీ సిటీ బస్సులు ప్రారంభించాలని నిర్ణయం తీసుకుంది.
రాష్ట్రానికి వస్తున్న750 బస్సులన్నీ సిటీ ఏసీ బస్సులుగా తిరగనున్నాయి. విశాఖపట్నం నగరానికి 100 సిటీ బస్సులు మంజూరయ్యాయి.
సింహపురి డిపోకు 50, గాజువాక డిపోకు 50 బస్సులు కేటాయించారు. విజయవాడ నగరానికి 100 బస్సులు ఉండగా ఇవన్నీ విద్యాధరపురం డిపోకు కేటాయించారు.
అక్కడ ఛార్జింగ్ స్టేషన్ ఏర్పాటు చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు.
గుంటూరు నగరంలో గుంటూరు -2 డిపోకు 100 బస్సులు రానున్నాయి.
మూడు నెలల్లో అన్ని ఏర్పాట్లు చేసి, బస్సులను రోడ్డెక్కించాలని ఆర్టీసీ నిర్ణయించింది