TTD15th Sep 01:25 PMSunil Byrisetty1 min read

టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం

తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలక్ట్రిక్ వాహనం విరాళంగా అందింది. బెంగళూరుకు చెందిన టివోల్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.15,94,962 విలువైన మొంట్రా ఎలక్ట్రిక్ ఏవి

టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం
తిరుమల తిరుపతి దేవస్థానానికి ఎలక్ట్రిక్ వాహనం విరాళంగా అందింది. బెంగళూరుకు చెందిన టివోల్ట్ ఎలక్ట్రిక్ వెహికిల్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.15,94,962 విలువైన మొంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్ (e-SCV) వాహనాన్ని సోమవారం టీటీడీకి విరాళంగా అందించింది. ఈ మేరకు ఆ సంస్థ ప్రతినిధులు శ్రీవారి ఆలయం ముందు వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను శ్రీవారి ఆలయ డిప్యూటీ ఈవో లోకనాథంకు అందజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ బోర్డు సభ్యులు భాను ప్రకాష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ వాహనాన్ని దేవస్థానం అవసరాల కోసం వినియోగించనున్నారు.
Tirumala Tirupati Devasthanams
TTD
Electric Vehicle Donation
e-SCV
Montra Electric Aviator
TVOLT Electric Vehicles
Temple Services
Devotional Transport
టీటీడీకి ఎలక్ట్రిక్ వాహనం విరాళం
e-SCV
మోంట్రా ఎలక్ట్రిక్ ఏవియేటర్
Scroll for the next article