Business Type9th Sep 03:52 PMSunil Byrisetty1 min read
దేశవ్యాప్తంగా ఈవీలకు పెరుగుతున్న ఆదరణ
దేశంలో విద్యుత్ వాహనాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టులో దేశవ్యాప్తంగా సుమారు 2.98 లక్షల విద్యుత్ వాహనాలు విక్రయించబడటం, గత ఏడాదితో పోలిస్తే 52.9 శాతం వృద్ధి నమోదవడం ఈ రంగా
దేశంలో విద్యుత్ వాహనాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి. ఆగస్టులో దేశవ్యాప్తంగా సుమారు 2.98 లక్షల విద్యుత్ వాహనాలు విక్రయించబడటం, గత ఏడాదితో పోలిస్తే 52.9 శాతం వృద్ధి నమోదవడం ఈ రంగానికి పెరుగుతున్న ఆదరణకు నిదర్శనం. మొత్తం వాహన మార్కెట్‌లో ఈవీల వాటా 9.5 శాతం నుంచి 12.3 శాతానికి పెరగడం భవిష్యత్ రవాణా వ్యవస్థలో విద్యుత్ వాహనాల ప్రాధాన్యతను తెలియజేస్తోంది.
2029 నాటికి ఏపీలో 2 లక్షల విద్యుత్ ద్విచక్ర వాహనాలు, కనీసం 10 వేల త్రిచక్ర వాహనాలు, 20 వేల కొత్త విద్యుత్ కార్లను ప్రోత్సహించడంతో పాటు ప్రజా రవాణాలో ఈవీల వినియోగాన్ని విస్తరించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రతి 30 కిలోమీటర్లకు ఒక విద్యుత్ ఛార్జింగ్ స్టేషన్ అందుబాటులోకి తీసుకురావడం, ఈ-మొబిలిటీ నగరాల అభివృద్ధి, స్టార్టప్‌లకు ప్రోత్సాహం వంటి చర్యలు రాష్ట్రంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థకు దోహదపడతాయి.