News26th Mar 05:08 PMSunil Byrisetty1 min read

చేనేత కార్మికుల ఉచిత విద్యుత్ జీవో విడుదల

రాష్ట్రంలో చేనేత కార్మికులకు సర్కార్ తీపి కబురు అందించింది. చేనేత వస్త్రాల తయారీ వ్యయం పెరిగిపోవడం, ఉత్పత్తులకు మంచి ధర రాకపోవడం వల్ల నేతన్నలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో నేతన్న

చేనేత కార్మికుల ఉచిత విద్యుత్ జీవో విడుదల
రాష్ట్రంలో చేనేత కార్మికులకు సర్కార్ తీపి కబురు అందించింది. చేనేత వస్త్రాల తయారీ వ్యయం పెరిగిపోవడం, ఉత్పత్తులకు మంచి ధర రాకపోవడం వల్ల నేతన్నలు అవస్థలు పడుతున్నారు. ఈ క్రమంలో నేతన్నల ఇబ్బందులపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించింది. ఇటీవల జరిగిన ఏపి కేబినెట్ సమావేశంలో ఆమోదం తెలిపిన చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. చేనేత కార్మికుల కుటుంబాలకు 200 యూనిట్లు వరకు ఉచిత విద్యుత్ ఇవ్వనున్నారు. ఈ పథకంలో 93 వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. 500 యూనిట్లు వరకు 10,534 పవర్ లూమ్స్ (మర మగ్గాలు) కు ఉచిత విద్యుత్ అందించనున్నారు. ఇందుకు సంవత్సరానికి 125 కోట్లు బడ్జెట్ అవసరమవుతుంది. ఈ మేరకు పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
Handloom Workers
Andhra Pradesh
Electricity Free
చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్
Scroll for the next article