News18th Oct 01:48 PMSunil Byrisetty1 min read
విద్యుత్ ఉద్యోగులతో చర్చలు సఫలం.. సమ్మె విరమణ
ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాదాపు 12 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో 1999-2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీ వేసే
ఏపీలో విద్యుత్ ఉద్యోగుల సమస్యలపై యాజమాన్యంతో జేఏసీ జరిపిన చర్చలు సఫలమయ్యాయి. దాదాపు 12 గంటల పాటు జరిగిన ఈ చర్చల్లో 1999-2004 మధ్య ఎంపికైన ఉద్యోగులకు పాత పెన్షన్ విధానంపై కమిటీ వేసేందుకు యాజమాన్యం అంగీకరించింది. కాంట్రాక్టు ఉద్యోగుల పర్మినెంట్, వారికి నేరుగా జీతం చెల్లింపుపై మాత్రం అంగీకారం తెలపలేదు. చర్చలు సఫలం కావడంతో సమ్మెను విరమిస్తున్నట్లు ఉద్యోగ సంఘాల నేతలు ప్రకటించారు. దీంతో కొద్ది రోజులుగా విద్యుత్ ఉద్యోగుల సమ్మె విషయంలో నెలకొన్న ఉత్కంఠ వీడినట్లయింది.