National16th May 03:54 PMSunil Byrisetty1 min read
ఇది ట్రైలరే.. అసలు సినిమా ముందుంది!
'ఆపరేషన్ సిందూర్'తో చేసినవి ట్రైలర్ లాంటివేనని, సమయం వచ్చినప్పుడు భారత సాయుధ దళాలు అసలు సినిమా చూపిస్తాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో ఉన్న భారత వైమా
'ఆపరేషన్ సిందూర్'తో చేసినవి ట్రైలర్ లాంటివేనని, సమయం వచ్చినప్పుడు భారత సాయుధ దళాలు అసలు సినిమా చూపిస్తాయని రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ అన్నారు. గుజరాత్‌లోని భుజ్‌లో ఉన్న భారత వైమానిక దళ స్థావరంలో ఆయన ప్రసంగించారు.
ఆపరేషన్ సిందూర్ ఇంకా ముగియలేదని స్పష్టం చేశారు.
ఆపరేషన్ సిందూర్‌ను విజయవంతంగా నిర్వహించినందుకు దళాలను అభినందించారు.
ఉగ్రవాద ఫ్యాక్టరీలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై రాజ్‌నాథ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
బ్రహ్మోస్ క్షిపణి శక్తి ఏంటో ఆపరేషన్ సిందూర్ ద్వారా పాకిస్థాన్‌కు తెలిసివచ్చిందన్నారు.
తరచుగా నేరాలు చేసేవారిని ఎలాగైతే నిఘాలో ఉంచుతారో, పాకిస్థాన్‌ను అలా తాము ప్రొబేషన్‌లో ఉంచామని చెప్పారు