News5th Oct 11:44 AMSunil Byrisetty1 min read
సీడ్ యాక్సెస్ రోడ్డు పై ఎలివేటెడ్ కారిడార్
అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ-3)ని జాతీయ రహదారి వరకూ విస్తరించేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎడిసిఎల్) కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దొండపాడు నుంచి వెంకట
అమరావతిలో నిర్మించిన సీడ్ యాక్సెస్ రోడ్డు (ఇ-3)ని జాతీయ రహదారి వరకూ విస్తరించేందుకు అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఎడిసిఎల్) కొత్త ప్రణాళికను రూపొందిస్తోంది. దొండపాడు నుంచి వెంకటపాలెం వరకూ నిర్మించిన ఈ రహదారిని అక్కడ నుంచి మణిపాల్ వద్ద 16వ నెంబరు జాతీయ రహదారిలో కలపనున్నారు. 45వ ప్యాకేజీలో భాగంగా రెండోదశలో సీతానగరం నుంచి మణిపాల్ ఆస్పత్రి వరకూ సుమారు రూ.613.30 కోట్లతో దీనిలో 6 లైన్ల ఎలివేటెడ్ కారిడార్లు, బ్రిడ్జ్లు, అండర్పాస్లు నిర్మించనున్నారు. 2024 చివర్లో ప్రభుత్వం ఈ అంచనాలు రూపొందించింది. ఎపిసిఆర్డిఎ అదనపు కమిషనర్ ఛైర్మన్ గా, ఎడిసిఎల్ చీఫ్ ఇంజినీరు మెంబర్ కన్వీనర్ గా వ్యవహరించే ఈ కమిటీలో ఆర్అండ్ బి, పబ్లిక్ హెల్త్, ఎపిసిఆర్డిఎ ఈ ఎన్సీ లు, గుంటూరు ఆర్టిఒ సభ్యులుగా ఉంటారు. రెండోదశలో నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ పనులకు గతంలో నిర్ణయించిన ధరలు సరిపోవని వాటిని సవరించాలని నిర్ణయించి వెంటనే కమిటీని కూడా ఏర్పాటు చేశారు. ఈ రోడ్డును సీతానగరం నుండి ఎన్టీఆర్ కట్ట వరకూ ఆధునిక పద్ధతుల్లో వైర్ బ్రిడ్జి, ఎలివేటెడ్ కారిడార్ రూపంలోనూ, మణిపాల్ ఆస్పత్రి వద్ద జాతీయ రహదారికి అండర్పస్ నిర్మించి జాతీయ రహదారిలో ఇంటర్ఛేంజ్ పద్ధతిలో నిర్మించాలని ప్రతిపాదనలు చేశారు.