News9th Nov 12:10 PMSunil Byrisetty1 min read
రాజధానిని కలుపుతూ ఎలివేటెడ్ కారిడార్!
రాజధాని అమరావతి నుంచి విజయవాడను అనుసంధానించేలా ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. ఉండవల్లి సమీపంలోని కొండవీటి వాగు లిఫ్ట్ సమీపంలో ప్రారంభమయ్యే ఈ కారిడార్ మణిపాల్ ఆస్పత్రి వద్ద
రాజధాని అమరావతి నుంచి విజయవాడను అనుసంధానించేలా ఎలివేటెడ్ కారిడార్ను నిర్మించనున్నారు. ఉండవల్లి సమీపంలోని కొండవీటి వాగు లిఫ్ట్ సమీపంలో ప్రారంభమయ్యే ఈ కారిడార్ మణిపాల్ ఆస్పత్రి వద్ద 16వ నెంబర్ జాతీయ రహదారితో
కలవనుంది. ఈ మేరకు ఆర్వీ అసోసియేట్స్ ప్లాన్ రూపొందించింది. గుంటూరు పంపింగ్ స్టేషన్ ట్యాంకు నుంచి కారిడార్ ప్రారంభమై.. కృష్ణా పశ్చిమ కాలువ మీదుగా కెఎల్రావు కాలనీ వైపు పాత జాతీయ రహదారిపై దిగుతుంది. కృష్ణా పశ్చిమ కాలువపై ఉండవల్లి వద్దనున్న వంతెన మీదుగా ప్రధాన కారిడార్ నిర్మాణం జరుగుతుంది. సీతానగరం కొండకు దక్షిణ భాగానికి ఆనుకుని బోట్ యార్డ్ మీదుగా. కోల్కతా చెన్నై ట్రంక్లైల్వే లైను దాటుకుని కారిడార్ ను నిర్మించనున్నట్లు మాస్టర్ ప్లానులో చూపించారు. దీనికోసం అక్కడ ఆర్ ఓ బి నిర్మించనున్నారు. అనంతరం ఎన్ టిఆర్ కట్టమీదుగా మణిపాల్ ఆస్పత్రి 16వ నెంబరు జాతీయ రహదారిపై కలుపనున్నారు.