News7th Dec 05:31 PMSunil Byrisetty1 min read

అక్రిడిటేషన్లకు త్వరగా దరఖాస్తు చేయాలి

అక్రిడిటేషన్లకు అర్హులైన జర్నలిస్ట్ లు త్వరగా దరఖాస్తు చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్.జె.డి) టి. కస్తూరి కోరారు. డిసెంబరు 15 నాటికి దరఖాస్తుల పరిశీల

అక్రిడిటేషన్లకు త్వరగా దరఖాస్తు చేయాలి
అక్రిడిటేషన్లకు అర్హులైన జర్నలిస్ట్ లు త్వరగా దరఖాస్తు చేయాలని సమాచార పౌర సంబంధాల శాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు (ఆర్.జె.డి) టి. కస్తూరి కోరారు. డిసెంబరు 15 నాటికి దరఖాస్తుల పరిశీలన పూర్తి చేసి అక్రిడిటేషన్లు జారీ చేయుటకు సిద్ధంగా ఉండాలని సంచాలకులు ఆదేశించి ఉన్నారని తెలిపారు. ఈ మేరకు అన్ని జిల్లాల్లో వేగవంతం చేయడం జరిగిందని చెప్పారు. అన్ని మీడియా యాజమాన్యాలు తమ సంస్థలో పనిచేస్తున్న జర్నలిస్టుల జాబితా అందజేసి సహకరించాలని కోరారు. అర్హులైన జర్నలిస్టులు తమ పేరును http://mediarelations.ap.gov.in వెబ్ సైట్ లో రిజిస్ట్రేషన్ చేసుకుని, దరఖాస్తులు సమర్పించాలని సూచించారు. జి.టి.పి.ఎల్ నెట్ వర్క్ లో వార్తలు ప్రసారం చేస్తున్న లోకల్ ఛానెల్ లకు, ఎం.ఎస్.ఎం.ఇ లుగా నమోదు చేసుకున్న ఛానెల్ లకు అక్రిడిటేషన్ల మంజూరుకు అవకాశాలపై కొంత మంది మీడియా ప్రతినిధులు కోరగా, సమాచార పౌర సంబంధాల శాఖ సంచాలకుల కార్యాలయంలో సంబంధిత అర్జీలు సమర్పించాలని, దానిపై వచ్చిన మార్గదర్శకాలకు అనుగుణంగా మంజూరు చేయడం జరుగుతుందని వివరించారు.
Andhra Pradesh
Accreditation
Journalists
Media Relations
Applications Open
AP News
Media Accreditation
Deadline
అక్రిడిటేషన్లకు జర్నలిస్టులు
దరఖాస్తులు
మీడియా అక్రిడిటేషన్
Scroll for the next article