Technology2nd Nov 01:49 PMSunil Byrisetty1 min read

ఎలాన్ మస్క్.. ఎగిరే కారు!

టెక్ దిగ్గజం, ఎక్స్(ట్విట్టర్), స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో ఆవిష్కరణకు తెర తీశారు. అసాధ్యాలను సాధ్యం చేసే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేశారు. తమ

ఎలాన్ మస్క్.. ఎగిరే కారు!
టెక్ దిగ్గజం, ఎక్స్(ట్విట్టర్), స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ మరో ఆవిష్కరణకు తెర తీశారు. అసాధ్యాలను సాధ్యం చేసే టెస్లా సీఈవో ఎలాన్ మస్క్ ఓ ఇంట్రెస్టింగ్ అనౌన్స్ మెంట్ చేశారు. తమ కంపెనీ నుంచి గాల్లో ఎగిరే కారును తెస్తున్నట్లు ఓ పాడ్కాస్ట్లో వివరించారు. ఈ ఏడాదిలోనే దానికి సంబంధించిన ప్రొటో టైప్ను ప్రదర్శిస్తామన్నారు. అయితే ఆ కారుకు రెక్కలుంటాయా? హెలికాప్టర్లా ఎగురుతుందా? అనే పలు ప్రశ్నలకు సమాధానం ఇవ్వలేదు. తమ ఆవిష్కరణ ఊహలకు అందని విధంగా ఉంటుందని మాత్రం మస్క్ స్పష్టం చేశారు. దీనిపై ప్రపంచవ్యాప్తంగా చర్చలు మొదలయ్యాయి.
Elon Musk
Tesla
SpaceX
Flying Car
Future Technology
Innovation
Prototype
Air Vehicle
Elon Musk Announcement
Scroll for the next article