International2nd Jul 10:45 AMSunil Byrisetty1 min read
ఎలాన్ మస్క్ కొత్త పార్టీ?
స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్” ఆమోదం లభించిన తర్వాత రోజే తాను పార్టీ పెడ
స్పేస్ ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ కొత్త పార్టీ పెట్టేందుకు సిద్ధమవుతున్నారు. అమెరికాలో ట్రంప్ ప్రభుత్వం ప్రతిపాదించిన “బిగ్ బ్యూటిఫుల్ బిల్” ఆమోదం లభించిన తర్వాత రోజే తాను పార్టీ పెడతానని ఆయన ప్రకటించారు. ఈ బిల్లు అమెరికాను దివాలా తీయిస్తుందని ఎలాన్ మస్క్ గట్టిగా నమ్ముతున్నారు. ఈ బిల్లును ప్రతిపాదించిన కారణంగానే ఆయన ట్రంప్‌కు గుడ్ బై చెప్పారు. అయితే రాజకీయాల్ని మాత్రం వదలడం లేదు. ఆ బిల్లుపై తన వ్యతిరేకత కొనసాగిస్తున్నారు. ఆయన తన పార్టీకి “ది అమెరికా పార్టీ” అనే పేరును ప్రతిపాదించారు.