News2nd Aug 11:04 AMSunil Byrisetty1 min read

శబరిమల భక్తులకు అత్యవసర హెచ్చరిక

శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సూచనలు చేసింది. పంపా ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిప

శబరిమల భక్తులకు అత్యవసర హెచ్చరిక
శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవాలనుకునే భక్తులు అప్రమత్తంగా ఉండాలి. ఈ మేరకు ట్రావెన్ కోర్ దేవస్థానం బోర్డు సూచనలు చేసింది. పంపా ప్రాంతంలో భారీ వర్షాలు, వరదలు, కొండచరియలు విరిగిపడే ప్రమాదం ఉన్న నేపథ్యంలో, ఆగస్టు 2, 3 తేదీలలో నిరపుత్తరి దర్శనానికి శబరిమల వెళ్లాలని ప్రణాళిక వేసుకున్న భక్తులు తమ ప్రయాణాన్ని పునఃపరిశీలించాలని ట్రావన్‌కోర్ దేవస్వం బోర్డు విజ్ఞప్తి చేసింది. ప్రస్తుతం భద్రతా హెచ్చరిక జారీ చేయబడినందున, భక్తులు అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించాలని కోరింది. పరిస్థితులు సాధారణ స్థితికి వచ్చే వరకు అనవసర ప్రయాణాలను నివారించాలని బోర్డు సూచించింది.
Sabarimala
Ayyappa
Sabarimala Temple
Sabarimala Pilgrimage
Travancore Devaswom Board
Pampa
Kerala
Heavy Rain
వరదలు
కొండచరియలు
భక్తులకు హెచ్చరిక
యాత్రికులు
కేరళ
అత్యవసర హెచ్చరిక
Scroll for the next article