Politics29th Jun 12:48 PMSunil Byrisetty1 min read

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమర్జెన్సీ డైరీ ఆవిష్కరణ

స్వాతంత్ర్య భారత దేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితిని విధించిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. గత పాలకులు దేశంలో చేసిన అ

బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమర్జెన్సీ డైరీ ఆవిష్కరణ
స్వాతంత్ర్య భారత దేశంలో రాజ్యాంగాన్ని తుంగలో తొక్కి కాంగ్రెస్ పార్టీ అత్యవసర పరిస్థితిని విధించిందని బీజేపీ రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. గత పాలకులు దేశంలో చేసిన అరాచకాలని బ్లూ కార్ట్ సంస్థ వారు మంచి పుస్తకాన్ని రచించారని తెలిపారు. 50 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ చేసిన అత్యంత దారుణానికి నిదర్శనంగా ప్రతి ఒక్కరు తెలుసుకునేలా బ్లూ కార్ట్ సంస్థ డైరీలో అంశాలు పొందుపరిచారని వివరించారు. అత్యవసర పరిస్థితి డైరీ వల్ల ఈ తరానికి తెలియాల్సిన మంచి అంశాలు పొందుపరిచారని డైరీని ఆవిష్కరించిన ఎంపీ పాకా సత్యనారాయణ కితాబు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ కార్యక్రమం రాష్ట్ర ఇంఛార్జి సన్నారెడ్డి దయాకర్ రెడ్డి, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బిట్ర శివన్నారాయణ తదితరులు పాల్గొన్నారు.
Politics
Bjp
Paka Venkata Satyanarayana
Emergencydiary Program
Sannareddy Dayakar Reddy
Blue Cart organization
బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఎమర్జెన్సీ డైరీ ఆవిష్కరణ
Scroll for the next article