News9th Dec 11:41 AMSunil Byrisetty1 min read
ఏపీలో ఎలక్ట్రానిక్ మొబిలిటీ విప్లవం.. రూ.5 వేలకే ఈ-సైకిల్
కాలుష్యరహిత రవాణా దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. “స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర” పథకాల పరిధిలో రూ.23,999 విలువైన ఈ-సైకిళ్లను కేవలం రూ.5 వేలకే ప్రజలకు అందించేందుకు
కాలుష్యరహిత రవాణా దిశగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. “స్వచ్ఛాంధ్ర–స్వర్ణాంధ్ర” పథకాల పరిధిలో రూ.23,999 విలువైన ఈ-సైకిళ్లను కేవలం రూ.5 వేలకే ప్రజలకు అందించేందుకు సిద్ధమైంది. మిగిలిన మొత్తాన్ని బ్యాంక్ లోన్ ద్వారా చెల్లించే విధంగా ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా సీఎం చంద్రబాబు సొంత నియోజకవర్గమైన కుప్పంలో పడనుంది. అక్కడ మొదటి విడతగా ఈ-సైకిళ్ల పంపిణీ ప్రారంభం కానుంది. విద్యార్థులు, యువత, ఉద్యోగులకు ఈ విధానం ప్రత్యక్ష లాభం చేకూర్చేలా కార్యాచరణ రూపొందించారు. అమ్మాయిలు, అబ్బాయిలకు వేర్వేరు డిజైన్‌లు, అవసరాలకు అనుగుణంగా మోడళ్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంధన వ్యయం తగ్గించడం, కాలుష్యాన్ని నియంత్రించడం, ఫిట్‌నెస్‌ను ప్రోత్సహించడం ఈ పథక లక్ష్యాలుగా పేర్కొంది.