News8th Jun 06:47 PMSunil Byrisetty1 min read
ఉద్యోగుల సంక్షేమం ప్రభుత్వ బాధ్యత
ప్రజల సమస్యల పరిష్కారం ఉద్యోగి బాధ్యతగా భావించాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంతే బాధ్యత తీసుకుంటుందని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి మొవ్వ తిరుమల కృష్ణబాబు అన
ప్రజల సమస్యల పరిష్కారం ఉద్యోగి బాధ్యతగా భావించాలని, ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం అంతే బాధ్యత తీసుకుంటుందని వైద్య, ఆరోగ్యశాఖ ప్రత్యేక కార్యదర్శి మొవ్వ తిరుమల కృష్ణబాబు అన్నారు. తాడేపల్లి లోని సిఎస్ఆర్ కళ్యాణ మండపంలో నిర్వహించిన అభినందన సభకు కృష్ణబాబు ముఖ్య అతిథిగా పాల్గొని కె.వి.శివారెడ్డిని సన్మానించారు. ప్రభుత్వ ఉద్యోగులకు అవసరమైన జీతభత్యాలు, ఇతర ప్రయోజనాలను ప్రజలు చెల్లించే పన్నుల ద్వారా పొందుతున్న మనం ప్రజల సంతృప్తి మేరకు పనిచేయడమే ప్రధాన కర్తవ్యంగా భావించాలన్నారు. గత జన్మలో చేసిన పుణ్యం లోని బ్యాలెన్స్ ఉండటం వల్లే ఈ జన్మలో మనం ప్రభుత్వ ఉద్యోగులుగా ఉన్నామని ప్రతి ఉద్యోగి గుర్తుంచుకోవాలన్నారు. ఉద్యోగులు ప్రజల సమస్యలు పరిష్కరించడం ఎంత బాధ్యత తీసుకుంటారో అదే రీతిలో ప్రభుత్వం కూడా ఉద్యోగుల సంక్షేమం పట్ల శ్రద్ధ తీసుకుంటుందన్నారు. ఉద్యోగులు ప్రభుత్వ ఉద్యోగం పొందేవరకు ఎంత వినయ విధేయతలతో ఉంటామో ప్రభుత్వ ఉద్యోగం పొందిన తర్వాత కూడా అవే వినయ విధేయతలు కొనసాగించాలన్నారు.