Education11th Jul 11:17 AMSunil Byrisetty1 min read
ఎస్సీ యువతకు ఉపాధి కల్పనకు చర్యలు
ఎస్సీ యువతకు ఉపాధి కల్పనకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నర్సింగ్, జీఎన్‍ఎం చదివిన వారికి ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ అందించనున్నారు. జర్మ
ఎస్సీ యువతకు ఉపాధి కల్పనకు మంత్రి డోలా బాలవీరాంజనేయస్వామి ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. నర్సింగ్, జీఎన్‍ఎం చదివిన వారికి ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శిక్షణ అందించనున్నారు. జర్మనీ భాషలో ఉచిత శిక్షణకు మంత్రి డీబీవీ స్వామి ఏర్పాటు చేశారు. శిక్షణ అనంతరం జర్మనీలో ఉద్యోగ, ఉపాధి అవకాశాల కల్పనకు చొరవ తీసుకుంటారు. అందులో భాగంగా మొదటి విడతలో 150 మందికి శిక్షణ ఇవ్వాలని ప్రతిపాదనలు సిద్ధం చేశారు. ఎస్సీల్లో చదువుకున్న ఏ ఒక్కరూ ఉద్యోగ, ఉపాధి లేమితో ఉండకూడదన్నదే సీఎం చంద్రబాబు లక్ష్యమని వివరించారు.