News11th Aug 10:24 AMSunil Byrisetty1 min read
పడిపోయిన పనిదినాలు!
దేశంలో ఉపాధి హామీ పనిదినాలు తగ్గిపోయాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్’ తీసుకొచ్చిన వి
దేశంలో ఉపాధి హామీ పనిదినాలు తగ్గిపోయాయి. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో కేంద్రం ‘వికసిత్ భారత్–గ్యారంటీ ఫర్ రోజ్‌గార్ అండ్ ఆజీవికా మిషన్’ తీసుకొచ్చిన విషయం తెలిసిందే. అలా మార్చిన వీబీజీ రామ్‌జీ పథకం తొలి నెలలోనే ఆశించిన స్థాయిలో పని కల్పించలేకపోయింది. గతేడాది జూలైతో పోలిస్తే ఈ ఏడాది జూలైలో దేశవ్యాప్తంగా పనిదినాలు దాదాపు 50 శాతం తగ్గాయి. గతేడాది జులైలో 15.33 కోట్ల పనిదినాలు కల్పించగా, ఈ ఏడాది జులైలో 7.67 కోట్ల పనిదినాలు మాత్రమే నమోదయ్యాయి. పథకం ద్వారా లబ్ధి పొందిన కుటుంబాల సంఖ్య కూడా సగానికి తగ్గాయి.